Karthikeya 2 జూన్ 24న మొదటి ట్రైలర్

Thursday,June 23,2022 - 05:30 by Z_CLU

Karthikeya-2 teaser will be unveiled on June 24th

ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్.. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సముద్రం దాచుకున్న అతిపెద్ద రహస్యం.. ఈ ద్వారకా నగరం అంటూ హీరో నిఖిల్ వాయిస్ తో వచ్చిన మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది.

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్.. నిఖిల్ కి జంట‌గా న‌టిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి మొదటి ట్రైలర్ జూన్ 24న విడుదల కానుంది. దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఇచ్చారు మేకర్స్.

మోషన్ పోస్ట‌ర్ లో ఆసక్తికరమైన విషయం డాక్ట‌ర్ కార్తికేయ ప్ర‌యాణం. శ్రీకృష్ణుడు చ‌రిత్ర‌లోకి ఎంట‌ర‌వుతూ క‌నిపిస్తున్నారు ఈయన. ఈ చిత్రంలోని భావాన్ని మోషన్ పోస్ట‌ర్ రూపంలో ద‌ర్శ‌కుడు చందు మొండేటి ప్రేక్ష‌కుల క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని జులై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది కార్తికేయ 2.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics