పవన్ క్లాప్ తో మొదలైన విశ్వక్ సేన్ -అర్జున్ సినిమా

Thursday,June 23,2022 - 02:49 by Z_CLU

Pawan Kalyan clap for Vishwak Sen – Arjun’s movie

విశ్వక్ సేన్ హీరోగా ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ దర్శక-నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. అర్జున్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై విశ్వక్ సేన్ , ఐశ్వర్య అర్జున్ ల మీద క్లాప్ కొట్టి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు , భోగవల్లి ప్రసాద్ గెస్టులుగా ఎటెండయ్యారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై నుండి మొదలు కానుంది. రోడ్ జర్నీ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బేనర్ పై అర్జున్ నిర్మిస్తున్న ఈ సినిమాతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా పరిచయం అవ్వబోతుంది. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకు రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు.

అర్జున్-విశ్వక్ సేన్ మూవీ లాంఛ్ ఫొటోస్

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics