బాబాయ్ డెడికేషన్ కి అబ్బాయి ఫిదా

Wednesday,November 09,2016 - 10:29 by Z_CLU

బాబాయ్ డెడికేషన్ కి అబ్బాయి ఇంప్రెస్ అయిపోయాడు. శాతకర్ణి గెటప్ లో బాబాయ్ రియల్ కింగ్ లా కనిపిస్తున్నాడు అని కితాబు కూడా ఇచ్చేశాడు. రీసెంట్ గా గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ చూసిన NTR షాక్ అయిపోయాడట. ఈ వయసులో కూడా సినిమా పట్ల బాబాయ్ కి ఉన్న డెడికేషన్ చూస్తుంటే, ఇంకా చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది అని ఫీలయ్యాడట అబ్బాయి.

చాలా ఇంపార్టెంట్ అకేషన్స్ అయితేనే కానీ పబ్లిక్ గా, ఒకే ఫ్రేం లో కనిపించని ఈ నందమూరి నటవారసులు, ఎప్పుడూ తమ మధ్య ఉన్న బాండింగ్ ని పబ్లిక్ చేసుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ని ఎప్పుడూ దేనికదే అన్నట్టుగా మ్యానేజ్ చేసుకుంటారు. దాన్ని కొందరు బాబాయి, అబ్బాయి మధ్య ఏవో విబేధాలు ఉన్నాయని పుకార్లు సృష్టిస్తారనుకోండి అది వేరే విషయం.

గౌతమీపుత్ర శాతకర్ణీ టీజర్ కి అబ్బాయి ఇంప్రెస్ అయ్యాడని తెలిసిన బాలయ్య సంతోషాన్ని వ్యక్తం చేశాడని సమాచారం. పనిలో పనిగా NTR నెక్స్ట్ ప్రాజెక్ట్స్ సంగతి కూడా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది.