పెళ్లి వేడుకలో నాగ్ తో సమంత...

Monday,August 29,2016 - 03:57 by Z_CLU

నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు స్వాతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. నిమ్మగడ్డకు అత్యంత సన్నిహితంగా మెలిగే నాగార్జున తన కుటుంబంతో పాటు వివాహానికి హాజరయ్యారు. అయితే అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంత కూడా కలిసిరావడం అందర్నీ ఆకర్షించింది. మరీ ముఖ్యంగా నాగార్జున, సమంత కలివిడిగా ఉంటూ నలుగుర్నీ పలకరించిన తీరు అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. కొంతమంది ప్రముఖులకు నాగార్జున స్వయంగా సమంతను పరిచయం చేశారు. వీటికి తోడు నాగచైతన్య-సమంత కలిసి వేడుకలో సందడి చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది