నాగ్ మేకోవర్.. సింప్లీ సూపర్బ్

Monday,November 20,2017 - 11:21 by Z_CLU

నాగార్జున-ఆర్జీవీ కాంబినేషన్ లో మూవీ ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టుడియోస్ లోని గ్లాస్ హౌజ్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా ప్రారంభమైంది. ప్రమోషన్ లో కింగ్ అనిపించుకున్న ఆర్జీవీ.. ఈ సినిమాను కూడా టాప్ ట్రెండింగ్ లో నిలిపాడు. ప్రారంభానికి ముందే ఇంటెన్స్ స్టిల్ రిలీజ్ చేసిన వర్మ.. తాజాగా నాగార్జున మేకోవర్ స్టిల్స్ కూడా విడుదల చేశాడు.

ఈ సినిమాలో నాగ్ ఎలా కనిపించబోతున్నాడనే సస్పెన్స్ ఇక ఎంత మాత్రం లేదు. తన సినిమాలో కింగ్ ఎలా కనిపించబోతున్నాడో ముందుగానే రివీల్ చేశాడు వర్మ. ప్రత్యేకంగా చేసిన ఫొటో షూట్ స్టిల్స్ ను మూవీ లాంచింగ్ సందర్భంగా రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో నాగార్జున పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడనే విషయం తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన స్టిల్స్ లో ఆ గెటప్ కనిపించింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా అల్టిమేట్ లుక్ తో అదరగొడుతున్నాడు నాగ్. చేతిలో గన్ పట్టుకొని, గాగుల్స్ పెట్టుకొని ఇంటెన్సివ్ లుక్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

మూవీ లాంచింగ్ సందర్ఙంగా ఈ స్టిల్స్ ను నాగ్ తన ట్విట్టర్ ఎకౌండ్ ద్వారా ఈ స్టిల్స్ రిలీజ్ చేశాడు. 28 ఏళ్ల కిందట శివ అనే సినిమా తన జీవితాన్ని మార్చిందని, మళ్లీ ఆ కాంబినేషన్ లో సినిమా వస్తోందని.. ఈ ఫీలింగ్ ను మాటల్లో వర్ణించలేనని ట్వీట్ చేశాడు. ఈ సినిమాను తన స్వీయ దర్శకత్వంలో స్వయంగా వర్మ నిర్మిస్తున్నాడు.