జీ సినిమాలు ( 20th నవంబర్)

Sunday,November 19,2017 - 10:03 by Z_CLU

అవును 2

నటీనటులు : పూర్ణ, హర్షవర్ధన్ రాణే

ఇతర నటీనటులు : రవి బాబు, సంజన గల్రాని, నిఖిత తుక్రాల్, రవి వర్మ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 3 ఏప్రిల్ 2015

రవిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ అవును సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది అవును 2. సినిమా కూడా రవిబాబు మార్క్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. హీరోయిన్ పూర్ణ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

అమరావతి

నటీనటులు : స్నేహ, భూమిక, తారకరత్న, సింధూర గద్దె, రవి బాబు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : రవి బాబు
ప్రొడ్యూసర్ : ఆనంద్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 3 డిసెంబర్ 2009

థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా నిలిచే దర్శకుడు రవి బాబు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘అమరావతి’. ఈ చిత్రం లో భూమిక, స్నేహ ల నటన, సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలు, రవి బాబు టేకింగ్, నందమూరి తారక రత్న క్యారెక్టర్ సినిమాకు హైలైట్స్. ఈ సినిమా కోసం తొలి సారిగా విలన్ అవతారమెత్తిన తారకరత్న ఈ చిత్రం లో నటన కు గాను నంది అవార్డు అందుకున్నారు. ఆద్యంతం  సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలతో ఈ సినిమా అలరిస్తుంది.

=============================================================================

అష్టా చెమ్మా

నటీనటులు : నాని, శ్రీనివాస్ అవసరాల, స్వాతి, భార్గవి

ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, హేమ, ఝాన్సీ, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రాగిణి

మ్యూజిక్ డైరెక్టర్ : కల్యాణి మాలిక్

డైరెక్టర్ : మోహన్ కృష్ణ ఇంద్రగంటి

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 2008

నాని, అవసరాల శ్రీనివాస్, స్వాతి, భార్గవి నలుగురికి ఒకేసారిగా ఓ రేంజ్ స్టార్ డం ని తీసుకొచ్చి పెట్టిన సినిమా ‘అష్టా చెమ్మా’. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్ళి చేసుకోవాలనుకునే లావణ్య చివరికి మహేష్ అనే పేరున్నా చాలు అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ప్రధాన కథాంశం.

==============================================================================

శ్రీ రామరాజ్యం

నటీనటులు : నందమూరి బాలకృష్ణ, నయన తార

ఇతర నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, శ్రీకాంత్, రోజా, మురళి మోహన్, M. బాలయ్య, బ్రహ్మానందం, A.V.S. తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ఇళయరాజా

డైరెక్టర్ : బాపు

ప్రొడ్యూసర్ : యలమంచిలి సాయి బాబు, సందీప్, కిరణ్

రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2011

బాలకృష్ణ హీరోగా బాపు డైరెక్షన్ లో అద్భుత చిత్రం శ్రీరామ రాజ్యం. తెలిసిన కథే అయినా బాపు గారు ఒక్కో సన్నివేశానికి తనదైన శైలిలో ప్రాణం పోసి మరీ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ఏకంగా 7 నంది అవార్డులను సాధించి పెట్టింది. ఈ సినిమాకు ఇళయ రాజా సంగీతం అందించారు.

=============================================================================

ధీరుడు

నటీనటులు : విశాల్, ఐశ్వర్య అర్జున్

ఇతర నటీనటులు : సంతానం, జగన్, జాన్ విజయ్, ఆదిత్య ఓం, మురళి శర్మ, సీత తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : మైకేల్ రాయప్పన్

రిలీజ్ డేట్ : 26 జూలై 2013

సినిమా సినిమాకి వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాడు విశాల్. సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించిన తొలి తమిళ చిత్రం “పట్టాతు యానై” సినిమాకి డబ్బింగ్ వర్షన్ ఈ ధీరుడు. ఈ సినిమా రెండు భాషలలోను ఒకేసారి రిలీజయింది. సంతానం కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

==============================================================================

శ్రీ మహాలక్ష్మి

నటీనటులు : శ్రీహరి, సుహాసిని

ఇతర నటీనటులు : షామ్న, సన, సాయాజీ షిండే, తిలకన్, ముమైత్ ఖాన్

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : ఫైట్ మాస్టర్ విజయన్

ప్రొడ్యూసర్ : శాంతి శ్రీహరి

రిలీజ్ డేట్ : 4 మే 2007

రియల్ స్టార్ శ్రీహరి కరియర్ లోనే బెస్ట్ యాక్షన్  థ్రిల్లర్ గా నిలిచింది శ్రీ మహాలక్ష్మి. శ్రీహరి లాయర్ గా నటించిన ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ విజయన్ డైరెక్టర్. ఆద్యంతం కట్టి పడేసే సస్పెన్స్ ఈ సినిమాలో హైలెట్.