ఇప్పటికింకా నా వయసు పాతికేళ్లే

Saturday,April 27,2019 - 10:39 by Z_CLU

ఆల్ మోస్ట్ 60కి దగ్గరయ్యాడు నాగార్జున. కానీ ఆయన్ని చూస్తే ఎవరూ 60 అంటే ఒప్పుకోరు. 30ప్లస్ లానే కనిపిస్తాడు. ఇప్పుడు మరింత యంగ్ గా తయారయ్యాడు నాగ్. మన్మధుడు-2 సినిమాకు సంబంధించి విడుదల చేసిన స్టిల్స్ లో నవ మన్మధుడిలా కనిపిస్తున్నాడు.

మన్మధుడు సినిమాలో నాగ్ అందంగా కనిపించాడు. మోస్ట్ హ్యాండ్సమ్ అనిపిస్తాడు. అదే సినిమా టైటిల్ తో వస్తున్న మన్మధుడు-2లో కూడా నాగ్ అంతే అందంగా ఉన్నాడు. వయసుతో పాటు నాగ్ అందం కూడా పెరుగుతుందేమో అనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుగుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న స్టిల్స్ ఆ షెడ్యూల్ కు సంబంధించినవే. రాహుల్ రవీంద్రన్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫొటోల్లో రకుల్ కంటే నాగార్జునే ఎట్రాక్ట్ చేస్తున్నాడు.