ఇస్మార్ట్ శంకర్ లో నభా నటేష్ లుక్

Saturday,April 13,2019 - 10:35 by Z_CLU

ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్` ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ సాంగ్‌లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా నటేష్ ఇద్ద‌రూ రామ్‌తో డాన్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా దిమాక్ ఖ‌రాబ్ అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాటకు సంబంధించి నిధి అగ‌ర్వాల్ లుక్‌కు చాలా మంచి స్పంద‌న‌ వ‌చ్చింది.

ఇప్పుడు న‌భా న‌టేశ్ లుక్ కూడా రిలీజ్ చేశారు. న‌భా న‌టేష్ స‌రికొత్త లుక్‌లో, రూర‌ల్ స్టైల్లో ఆక‌ట్టుకుంటుంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

న‌టీన‌టులు: రామ్, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌, పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ
ఆర్ట్‌: జానీ షేక్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌
ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.