'జెర్సీ' హిట్ గ్యారంటీ – బిగ్గెస్ట్ రీజన్ ఇదే

Saturday,April 13,2019 - 10:04 by Z_CLU

‘జెర్సీ’ హిట్ గ్యారంటీ.. ఇది ప్రీ రిలీజ్ టాక్… కానీ రిలీజ్ తరవాత బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓ స్టార్ సినిమా ట్రైలర్ రిలీజయిందంటే ట్రెండ్ అవ్వడం కామనే. కానీ కనెక్ట్ అవ్వడం రేర్ గా జరుగుతుంది. ‘జెర్సీ’  ట్రైలర్  ఆ రేర్ స్టాండర్డ్స్ ని రీచ్ అయింది. ‘జెర్సీ’ లో ఒక్కో క్యారెక్టర్ కి మధ్య కనెక్ట్ అయి ఉన్న ఎమోషనే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ కానుంది.

ట్రైలర్ తో ఆల్మోస్ట్ సినిమా కథ అర్థమయిపోయింది. ఇప్పుడు ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని కోరుకునేది ఆ ఎమోషనల్ జర్నీ లో ట్రావెల్ చేయడమే. రీసెంట్ ప్రమోషన్స్ లో నాని చెప్పినట్టు, ఎక్కడా న్యాచురల్ స్టార్ కనిపించడం లేదు. సినిమాలో ఎవరైనా ఉంటే అది అర్జున్ ఒక్కడే. యంగ్ ఏజ్ లో క్రికెటర్ లా.. లవర్ బాయ్ లా చివరికి ఫెయిల్యూర్స్ తో కంప్లీట్ నిరాశ అలుముకున్న టైమ్ లో కూడా కొడుకు దృష్టిలో హీరోగా నిలిచిపోవాలని తపించే తండ్రిలా… ఎంత కష్టానికైనా ఓర్చి నిలబడి నెగ్గే ఓ సక్సెస్ ఫుల్ స్పోర్ట్స్ మ్యాన్ అర్జున్ కథ ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా కోసం జస్ట్ కథను రాసుకోలేదు. ఒక ఎమోషనల్ ప్యాకేజ్ ని డిజైన్ చేసుకున్నాడు.

నిన్న మొన్నటి వరకు ‘జెర్సీ’ సినిమా అనగానే క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా. కానీ నిన్న రిలీజైన ట్రైలర్ మాత్రం ఒక్కసారిగా సినిమాపై అభిప్రాయాన్ని మార్చేసింది. అర్జున్ పడే స్ట్రగుల్ ని కీ పాయింట్ గా ఎంచుకున్న గౌతమ్, ఆడియన్స్ ఎప్పటి నుండో, ఎలాంటి సినిమానైతే చూడాలనుకుంటున్నారో, ఆ ఎమోషన్స్ అన్నింటినీ కలిపి ఒక్కచోట ప్రెజెంట్ చేయబోతున్నాడు.

స్పోర్ట్స్ కోటా లో FCI లో ఉద్యోగం దొరికినా, నమ్మిన ఆట తప్ప ఇంకోలా బ్రతకడం తెలియని అర్జున్ స్ట్రగుల్ లైఫ్, తన 36 ఏట, ఎలా సక్సెస్ ట్రాక్ ఎక్కింది..? ఈ ప్రాసెస్ లో అర్జున్ ఫేస్ చేసే ఎమోషనల్ ఫేజ్… ‘జెర్సీ’ సక్సెస్ కి ముడిసరుకు కానుంది. అల్టిమేట్ గా ‘జెర్సీ’ ఎమోషన్స్ ఉన్న ప్రతి ఒక్కరి సొంత కథ అనిపించుకోనుంది. అందుకే రిలీజ్ కి ముందే   హిట్ గ్యారంటీ అనిపించుకుంటుంది.