థమన్ ఇంటర్వ్యూ

Tuesday,December 03,2019 - 04:51 by Z_CLU

ప్రస్తుతం తన మ్యూజిక్ తో మేజిక్ చేస్తూ వరుస సూపర్ సాంగ్స్ డెలివరి చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా ‘వెంకీ మామ’ సినిమా గురించి మాట్లాడాడు. ఆ విశేషాలు తమన్ మాటల్లోనే.

 

మంచి కథలొస్తున్నాయి

ప్రస్తుతం నా నుండి వస్తున్న సాంగ్స్ సూపర్ హిట్స్ అవ్వడం మ్యూజిక్ లవర్స్ కి ఫేవరెట్ గా మారడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం నాకు మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. మంచి సాంగ్స్ ఇవ్వడానికి అలాంటి స్విచువేషన్స్ డైరెక్టర్స్ నాకు ఇస్తున్నారు. అందువల్లే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ట్యూన్స్ ఇవ్వగలుగుతున్నాను. కథలు బాగుంటే ఆటోమేటిక్ గా మంచి సాంగ్స్ వస్తాయి.

 

‘సరైనోడు’ తర్వాత బాగా స్టడీ చేశాను.

‘సరైనోడు’ తర్వాత బ్రేక్ తీసుకొని ఏడాదిన్నర పాటు నా విషయంలో అసలేం జరుగుతుందని స్టడీ చేశాను. ఆ తర్వాత ‘మహానుభావుడు’,’భాగమతి’,’తొలి ప్రేమ’,’చల్ మోహన్ రంగ’, ‘అరవింద సమేత’ సినిమాలు చేసాను. ఆ సినిమాలకు సంబంధించి ఆల్బమ్స్ తో పాటు బాగ్రౌండ్ స్కోర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆడియన్స్ కి చాలా థాంక్స్ చెప్పాలి. నా ప్రతీ సాంగ్ ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.

 

ఫీడ్ బ్యాక్ తీసుకుంటా

ఏ పనికైనా ఫీడ్ బ్యాక్ అనేది తప్పకుండా తీసుకోవాలి. అందుకే ట్విట్టర్ లో అందరితో ఇంట్రాక్ట్ అవుతుంటాను. ఎప్పటికప్పుడు వారి నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంటాను. వారిచ్చిన ఫీడ్ బ్యాక్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ నెక్స్ట్ సినిమాకు వర్క్ చేస్తా. నిజానికి ఎవరైనా ఉరికే ట్వీట్ వేయరు కదా ఆటను భాద పడే ఉంటాడు కదా సో అలా ఆలోచిస్తాను. వాణ్ణి హ్యాపీ చేయాలని మళ్ళీ వర్క్ చేస్తుంటాను. ఆ తర్వాత మొన్న నచ్చలేదు కదా ఈ సాంగ్ ఎలా ఉంది అని అడిగి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాను.

ఎమోషనల్ సినిమా

‘వెంకీ మామ’ వెరీ ఎమోషనల్ సినిమా. ఎడిటింగ్ లో వితౌట్ డబ్బింగ్ ,ఆర్ ఆర్ తో సినిమా చూసినప్పుడే నన్ను కదిలించింది. నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. వెంటనే సినిమా ఇలాగే నాకు ఇవ్వండి నేను ఆర్.ఆర్ స్టార్ట్ చేస్తా అని చెప్పి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొదలుపెట్టాను.

బిట్ సాంగ్ ఉంటుంది.. కానీ

సినిమాలో ఎమోషనల్ మూడ్ ను క్యారీ చేసేలా ఓ బిట్ సాంగ్ ఉంటుంది. కానీ లిరిక్స్ ఉండవు జస్ట్ ఇన్స్టిమెంటల్ గా ఉంటుంది. ఎందుకో మళ్ళీ లిరిక్స్ రాయించి పాడి దాన్ని ఓవర్ డూ చేయడమని అలా కంపోజ్ చేసినట్టే ఉంచేసి వెనకాల థీమ్స్ లా ఫాలో అయ్యాను.

‘మామ అల్లుడు’ పోటీ పడి నటించారు

ఇంట్లో పెద్ద మనిషి ఎంత కక్వాలిటీగా ఆలోచిస్తే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి లైఫ్ ఎంత బాగుంటుంది అనేది తీసుకొని బాబీ కథ రెడీ చేసుకున్నాడు. మామ అల్లుడు పోటీ పడి నటించారు. సురేష్ బాబు గారు కూడా అంతే గొప్పగా ప్రొడ్యూస్ చేసారు. అందరూ అలాగే వర్క్ చేసారు. సినిమా చూసిన మొదటి ఆడియన్ గా చెప్ప్తున్నా 13న సినిమా చూసి అందరూ నాలాగే ఫీలవుతారు.

కథలో ఎమోషన్ తెలియాలి

ఏ సినిమాకైనా కథలో ఎమోషన్ తెలియాలి. అప్పుడే ఏ టెక్నీషియన్ అయినా బెస్ట్ ఇవ్వగలడు. నేను వర్క్ చేసే ప్రతీ సినిమాకు సంబంధించి పూర్తి కథ వింటాను. అప్పుడే కథలో పాటలను ఎలా కనెక్ట్ చేయాలనేది ఎలాంటి లిరిక్స్ రాయించాలనేది తెలుస్తుంది. ఒక్కో సారి ప్రాపర్ గా రెండు మూడు సార్లు స్టోరీ నెరేషన్ ఉంటుంది.

ఫైట్ చాలా నచ్చింది

సినిమాలో వెంకీ గారు చైతూ చేసే ఓ ఫైట్ సినిమాకు హైలైట్ . నాకు బాగా నచ్చింది. ఇద్దరూ కుమ్మేసారు. అందుకే ఆ ఫైట్ గురించి ఆడియన్స్ కి చెప్పాలని పించి ట్వీట్ వేసాను.

వెంకీ గారిని చూసి ఎంజాయ్ చేస్తారు

సినిమాలో వెంకీ మామ టైటిల్ సాంగ్ తో పాటు అన్ని సాంగ్స్ ఎట్రాక్ట్ చేస్తాయి. ముఖ్యంగా ఎన్నాళ్ళకో సాంగ్ అయితే ఐయ్ ఫీస్ట్ లా ఉంటుంది. అందులో వెంకీ గారిని బెల్బాటం ప్యాంట్ తో రెట్రో లుక్ లో డాన్స్ చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ సాంగ్ వీడియో కూడా రిలీజ్ చేయమని సురేష్ బాబు గారికి చెప్పాను. కానీ నో అన్నారు.

కమర్షియల్ సినిమానే కష్టం

కమర్షియల్ సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా కష్టం. లవ్ స్టోరీనొ ఇంకేదైనా అయితే చేసేయొచ్చు కానీ కమర్షియల్ సినిమాకు అన్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. హీరో కత్తి పట్టుకుని కూర్చోగలడని ముందు నుండే మ్యూజిక్ చెప్పాలి. ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

24 క్రాఫ్ట్స్ లో ఖర్చు మాకే ఎక్కువ

 మాకిచ్చే డబ్బు పది మందికి ఇచ్చుకోవాలి. సింగర్స్ , లిరిసిస్ట్ కి, కీ బోర్డ్ ప్లేయర్ కి , ఫ్లూట్ కి ఇలా అందరికీ ఇవ్వాల్సి వస్తుంది. ఏ క్రాఫ్ట్స్ లో ఎవరూ మిగతా వారికీ డబ్బులు ఇవ్వనక్కర్లేదు. మిగతా వాళ్ళ డబ్బులు అలా డైరెక్ట్ గా బ్యాంక్ లో వేసుకుంటారు.

 

రీమిక్స్ చేయను రీజన్ అదే

ఇకపై రీమిక్స్ చేయను. కారణం ఆ మ్యూజిక్ డైరెక్టర్ , సింగర్ , లిరిక్ రైటర్ నన్ను తిట్టుకుంటారు. బాలు గారు ఫోన్ చేసి మరీ తిడతారు. ఎప్పుడైనా అడుగుతారు ఎందుకు రా మనకి ఈ టెన్షన్ అంటారు. కొన్నేళ్ళ తర్వాత నా సాంగ్ ఎవరైనా రీమిక్స్ చేస్తే నేనే తిట్టుకుంటాను. అందుకే ఇకపై రీమిక్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాను.

 

మేము చాలా క్లోజ్ గా ఉంటాం

మా మధ్య ఎలాంటి పర్సనల్ గొడవలు ఉండవు. ఎవరైనా సాంగ్ కంపోజ్ చేసి అది హిట్టయితే హ్యాపీగా ఫీలవుతాం. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ మూడు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఇక వర్క్ విషయంలోనే కాంపిటిషన్ తప్ప బయట మేము చాలా క్లోజ్ గా ఉంటాం.

 

నెక్స్ట్ మాస్ బీట్ సాంగ్స్ 

‘అల వైకుంఠపురములో’ నుండి వచ్చే నెక్స్ట్ సాంగ్స్ కూడా మంచి మాస్ బీట్ తో ఉంటాయి. ఈ మూడు సాంగ్స్ లాగే అవి పెద్ద హిట్టవుతాయనే నమ్మకం ఉంది. ఆ సినిమాకు  పనిచేస్తూ  సీతరామ శాస్త్రి గారి నుండి త్రివిక్రమ్ గారి నుండి చాలా నేర్చుకున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. కంప్లీట్ గా హ్యాపీ ఫిలిం. అందరూ ఎంటర్టైన్ అయ్యేలా ఉంటుంది.