కాంబినేషన్ అదుర్స్.. మరో ఇంట్రెస్టింగ్ మూవీ

Tuesday,December 03,2019 - 03:13 by Z_CLU

హీరోగా నిఖిల్.. కథ-స్క్రీన్ ప్లే సుకుమార్
ప్రజెంటర్ అల్లు అరవింద్.. నిర్మాత బన్నీ వాస్
ఇలా ఓ సినిమా కోసం ఈ నలుగురు కలిశారు. ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కు డైరక్టర్ సూర్యప్రతాప్. ఈరోజు ఈ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై తను ఓ సినిమా చేయబోతున్నట్టు నిఖిల్ ఇప్పటికే ప్రకటించాడు. కానీ అది ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఆడియన్స్ కు ఇప్పుడే తెలిసింది. సుకుమార్ యాడ్ అవ్వడమే ఈ ప్రాజెక్టుకు ఓ లుక్, కిక్కు తీసుకొచ్చింది.

నిజానికి వీళ్లంతా గతంలో ఒకరితో ఒకరు వర్క్ చేశారు. గీతాఆర్ట్స్ బ్యానర్ పై హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా చేశాడు సుకుమార్. ఇక సుకుమార్-సూర్యప్రతాప్ కలిసి కుమారి 21 ఎఫ్ సినిమా చేశారు. సో.. వీళ్ల టీమ్ లోకి నిఖిల్ కొత్తగా యాడ్ అయ్యాడన్నమాట.

ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతానికి ఇవే అప్ డేట్స్. హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఎవరనేది త్వరలోనే వెల్లడిస్తారు. కార్తికేయ-2కు కాల్షీట్లు కేటాయించాడు నిఖిల్. అదొక షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వస్తుంది.