ఓ మంచి సినిమాకు ఐదేళ్లు

Tuesday,December 24,2019 - 02:21 by Z_CLU

ఏటా ఎన్నో సినిమాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోతాయి. అలాంటి సినిమానే ముకుంద. మెగాహీరో వరుణ్ తేజ్ ను సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేసిన ఈ మూవీ ఇవాళ్టితో ఐదేళ్లు పూర్తిచేసుకుంది.

అంతా గుర్తుంచుకోవడానికి ప్రధాన కారణం ఈ సినిమా స్టోరీలైన్. లోకల్ పాలిటిక్స్ కు లవ్ స్టోరీని అద్ది, అత్యంత సహజంగా మూవీని తీర్చిదిద్దాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. పైగా మెగాహీరో లాంఛ్ మూవీ కావడం మరో హైలెట్.

ముకుంద మూవీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డేకు కెరీర్ స్టార్టింగ్ లో ఇది మంచి ఫౌండేషన్ మూవీగా నిలిచింది. తెలుగులో ఆమెకిది సెకెండ్ రిలీజ్. ఈ సినిమా నుంచే పూజా హెగ్డే, తెలుగు ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ మరో హైలెట్. రిలీజై ఐదేళ్లయినా ఇంకా ముకుంద గురించి మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం మిక్కీ మ్యూజిక్ తో పాటు మూవీ కంటెంట్.