కొత్త సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ ఇదేనా!

Tuesday,December 24,2019 - 01:18 by Z_CLU

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో రెండు మోస్ట్ పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారు చిరు. వాటి క్యారెక్టర్స్ పేర్లు కూడా బయటకొచ్చాయి. ఆచార్య అనే పాత్రతో పాటు గోవింద్ అనే మరో మాస్ పాత్రలో చిరంజీవి కనిపిస్తారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు గోవింద్ కు సంబంధించి మరో రూమర్ బయటకొచ్చింది.

సినిమాలో గోవింద్ అనే నక్సలైట్ పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ క్యారెక్టర్ కోసమే చిరంజీవి ప్రస్తుతం బరువు తగ్గే పనిలో పడ్డారని అంతా అంటున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే పాత్రలా దీన్ని తీర్చిదిద్దరట కొరటాల. ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా సెట్స్ పైకి రావాల్సిందే.

ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను సెలక్ట్ చేశారు. మరో హీరోయిన్ కు కూడా ప్లేస్ ఉందని అంటున్నారు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.