మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్.. రెడీ ఫర్ రిలీజ్

Saturday,May 12,2018 - 12:08 by Z_CLU

బ్రూస్‌ లీ, ఎంతవాడుగాని చిత్రాల్లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న  సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మంజుల‌ తనయుడు.  ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తోన్న సాహో చిత్రంలోనూ విల‌న్‌గా నటిస్తోన్న అరుణ్‌  విజయ్‌ ఇటీవల తమిళంలో హీరోగా నటించిన చిత్రం ‘కుట్రమ్‌ 23’.  ఈ చిత్రాన్ని  శ్రీ విజయ నరసింహా ఫిలింస్‌ పతాకంపై ‘క్రైమ్‌ 23’ పేరుతో  రెడీ చేశారు.

ప్రసాద్‌  ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌ సంయుక్తంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. ‘వైశాలి’ చిత్రం ఫేమ్‌ అరివళగన్‌ దర్శకుడు. మహిమ నంబియార్‌, అభినయ హీరోయిన్స్‌. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న విడుద‌లకు సిద్ద‌మైంది.

అరుణ్‌ విజయ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా అద్భుతమైన నటన కనబరిచాడు. ఇందులో  మంచి మెసేజ్‌ తో పాటు ఆడియన్స్‌కు కావాల్సిన కమర్షియల్‌ హంగుల‌న్నీ ఉన్నాయి. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు చూడాల్సిన చిత్రం ఇది అంటోంది యూనిట్.  విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు.