తమన్నా ఫస్ట్ లుక్ ని రివీల్ చేయనున్న సైరా టీమ్..?

Saturday,May 12,2018 - 11:07 by Z_CLU

మెగాస్టార్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘సైరా’ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా, సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ ఎలిమెంట్స్ లో చేరిపోతుంది. అయితే నిన్నటి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేసింది తమన్నా. దాంతో మెగాఫ్యాన్స్ ఫోకస్ తమన్నాపై మళ్ళింది.

హిస్టారికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ సినిమాలో తమన్నా కూడా నటిస్తుందనే కన్ఫర్మేషన్ రాగానే, ఈ సినిమాలో తమన్నా ప్లే చేయబోయే రోల్ దగ్గరి నుండి, తన లుక్స్ ఎలా ఉండబోతున్నాయోనన్న డిస్కర్షన్, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.

సినిమాలో కీ రోల్ ప్లే చేసిన అమితాబ్ దగ్గరి నుండి మెగాస్టార్, నయనతార గెటప్స్ ని ఏ మాత్రం సస్పెన్స్ మెయిన్ టైన్ చేయకుండా రివీల్ చేసిన ఫిల్మ్ మేకర్స్, తమన్నా లుక్స్ ని కూడా త్వరలో రిలీజ్ చేసే చాన్సెస్ ఉన్నాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఫిల్మ్ మేకర్స్ ఏ డెసిషన్ తీసుకుంటారో చూడాలి. ఈ సినిమాని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.