నారా రోహిత్, జగపతి బాబుల 'ఆటగాళ్లు' ఫస్ట్ లుక్ రిలీజ్

Saturday,May 12,2018 - 02:53 by Z_CLU

ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆటగాళ్లు’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత వాసిరెడ్డి రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.. త్వరలో ఆడియో, మరియు ట్రైలర్ లను  విడుదల చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.

డైరెక్టర్ పరుచూరి మురళి మాట్లాడుతూ.. పెద్దబాబు చిత్రం తరువాత జగపతిబాబు గారితో చేస్తున్న చిత్రం ఇది. మొదట ఈ సబ్జెక్ట్ నేను చేయను అన్నారు కానీ నేను పట్టుపట్టడంతో ఇంకొకరిని ఎవరినైనా లీడ్ గా తీసుకురా చేద్దాం అన్నారు.. అప్పుడు నారా రోహిత్ గారైతే పర్ఫెక్ట్ అనిపించింది అన్నారు..