చిరు, నాగ్ సాంగ్...మోదీ ట్వీట్

Saturday,April 04,2020 - 12:19 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి పాడిన పాటను ప్రైమ్ మినిస్టర్ మోదీ అభినందించారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమై కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకొని దైర్యంగా ఫైట్ చేయాలంటూ ఓ సాంగ్ తో పిలిపినిచ్చారు చిరు, నాగ్. ఇళ్లల్లో ఉంటూ వైరస్ ని ఎలా ఎదుర్కోవాలో చెబుతూ తమ వంతుగా జనాల్లో చైతన్యం తీసుకొచ్చారు.

లెట్స్ ఫైట్ అంటూ కోటి కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో చిరంజీవి, నాగార్జున తో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా కనిపించి తమ వంతుగా గొంతు కలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పాటను మెచ్చుకొని చిరు, నాగార్జున, వరుణ్, సాయి తేజ్ ను అభినందించి ధన్యవాదాలు తెలిపారు.

చిరంజీవి కీ, నాగార్జున కీ, వరుణ్ కీ , సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు అంటూ తెలుగులో ట్వీట్ చేశారు మోదీ.