RRR పోస్ట్ పోన్ పై నిర్మాత ఏమన్నాడంటే?

Saturday,April 04,2020 - 12:00 by Z_CLU

మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించిన ఈ తేదీకి సినిమా రావడం కష్టమని, లాక్ డౌన్ కారణంగా సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే దీనిపై నిర్మాత దానయ్య స్పందించాడు. సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సే లేదని తేల్చిచెప్పారు. సినిమా విడుదలకు ఇంకా చాలా టైం ఉందని, ఈ లోపు అన్నీ సెట్ అయి షూట్ పూర్తవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్ కే సినిమాను రిలీజ్ చేస్తామని ఆ విషయంలో టీమ్ అందరం కాన్ఫిడెంట్ గా ఉన్నామని అన్నారు.

దీంతో రాజమౌళి RRR రిలీజ్ పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఏదేమైనా మేకర్స్ ఈ డేట్ ను మిస్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రస్తుతం షూట్ చేసిన పార్ట్ వరకూ గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుందని సమాచారం.