పవర్ జెనెరేట్ చేస్తున్న పవర్ స్టార్ సాంగ్

Friday,March 03,2017 - 05:01 by Z_CLU

కాటమ రాయుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ‘మిర మిర మీసం మెలి తిప్పుతాడు జనం కోసం’ అంటూ సాగే ఈ సాంగ్, సోషల్ మీడియాలో ఆల్ రెడీ స్పేస్ క్రియేట్ చేసుకోవడం బిగిన్ అయిపోయింది. ఈ రోజు 4 గంటలకు సాంగ్ రిలీజ్ చేసిన సినిమా యూనిట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ లో రియల్ పవర్ ని జెనెరేట్ చేసింది.

మార్చి 4 నుండి యూరోప్ లో పవన్ కళ్యాణ్, శృతిహాసన్ కాంబినేషన్ లో రొమాంటిక్ సాంగ్స్ ని తెరకెక్కించే పనిలో పడనున్న సినిమా యూనిట్, మరో వైపు కాటమరాయుడు ఫీవర్ ని ఇప్పటి నుండే ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టేసింది. రిలీజ్ అయిన ఈ సాంగ్ లో అనూప్ రూబెన్స్  మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

వన్ బై వన్ సింగిల్స్ ని రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, ఈ నెల 18 న సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసి, సినిమాని మర్చి 24 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.