మహేష్ బాబు సినిమా అప్ డేట్స్

Friday,March 03,2017 - 12:41 by Z_CLU

ప్రతీది పర్ ఫెక్ట్ గా ఉండాలి అనుకున్నప్పుడు కాస్త లేట్ ఆక్యుపై అవ్వడం కామనే. మహేష్ బాబు మురుగదాస్ సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది. సినిమాని జూన్ 23 న రిలీజ్ చేయాలని డిసైడ్ అయిన సినిమా యూనిట్, టైటిల్ విషయంలోనే అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేకపోతుంది. ‘సంభావామి యుగే యుగే’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసుకున్నా ఫైనల్ డెసిషన్ కి రాని సినిమా యూనిట్, ఇంకా ఈ విషయంలో డిస్కషన్స్ జరుపుతూనే ఉంది.

టైటిల్ విషయంలో డిసైడ్ అవ్వకపోయినా, పక్కాగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ ప్రకారం దూసుకుపోతున్న మహేష్ బాబు & మురుగదాస్ టీం, ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నైట్ మోడ్ లో జరుగుతున్న ఈ షూటింగ్ లో సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ షెడ్యూల్ పూర్తి కాగానే ముంబై బయలుదేరనున్న టీం, మ్యాగ్జిమం మే కల్లా షూటింగ్ కి ప్యాకప్ చెప్పే ఆలోచనలో ఉంది. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా జూన్ 23 న రిలీజ్ కి రెడీగా ఉంది.