అఖిల్ రెండో సినిమా సెట్స్ పైకి...

Friday,March 03,2017 - 07:00 by Z_CLU

అఖిల్ రెండో సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుంది. విక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కి ఆల్ మోస్ట్ ప్యాకప్ చెప్పేసినట్టే. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా ‘ఏప్రిల్ 1st నుండి సెట్స్ పైకి రాబోతుంది.

ఫస్ట్ సినిమాతోనే తన స్టైలిష్ మాస్ లుక్స్ తో మెస్మరైజ్ చేసిన అఖిల్, రెండో సినిమాపై హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. రెండో సినిమా కంటెంట్ ఏమై ఉంటుందో ప్రస్తుతానికి తెలీడం లేదు కానీ, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో ఫాం లో ఉన్న విక్రమ్ కుమార్ డైరెక్టర్ అనగానే డిఫెరెంట్ సినిమా గ్యారంటీ అని ఫిక్స్ అయి ఉన్నారు ఫ్యాన్స్.

 

ఈ సినిమా హీరోయిన్ తో పాటు తక్కిన టెక్నీషియన్స్ ని ఫైనలైజ్ చేసే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, రైట్ టైం చూసుకుని మిగతా డీటేల్స్ ని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.