Nagarjuna Bangarraju - సీనియర్ హీరోయిన్ కు చోటు?

Tuesday,June 22,2021 - 03:52 by Z_CLU

‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు ‘బంగార్రాజు’ అనే టైటిల్ తో నాగార్జున సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా తెరకెక్కనున్న ఈ సీక్వెల్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాలో హీరోయిన్స్ తో పాటు మిగతా పాత్రలకు కూడా నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.

nagarjuna bangarraju

సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం జయప్రదని తీసుకుంటున్నారని తెలుస్తుంది. నిడివి తక్కువే అయినా జయప్రద కథలో కీలకమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం జయప్రద రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఓ వెబ్ ఫిలింలో నటిస్తుంది. VN Aditya ఆ సినిమాకు దర్శకుడు. సో తెలుగులో మళ్ళీ సినిమాలు చేస్తుంది కనుక జయప్రదని బంగార్రాజు కోసం సంప్రదించి ఉండొచ్చు.

jayaprada in Nagarjuna Bangarraju zeecinemalu

జయప్రద

ఇక సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేస్తున్నాడని , అఖిల్ నాగార్జున మనవడిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంత అన్నది తెలియాలంటే మేకర్స్ నుండి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక వీలనంత స్పీడుగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు నాగార్జున సన్నాహాలు చేస్తున్నారట. మరి సోగ్గాడే చిన్ని నాయనతో పెద్ద హిట్ కొట్టిన నాగార్జున ఈసారి ఈ సీక్వెల్ తో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics