సీనియారిటీ చూపించిన చిరు

Thursday,October 27,2016 - 02:34 by Z_CLU

ప్రస్తుతం ఖైదీ నంబర్-150 సినిమా చేస్తున్నారు చిరంజీవి. మెగాస్టార్ కు ఇది కేవలం 150వ సినిమానే కాకుండా… లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న రీఎంట్రీ మూవీ కూడా. అందుకే ఈ సినిమాపై అభిమానులు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో… చిరంజీవి కూడా అంతే ఫోకస్ పెట్టారు. తాజాగా ఈ సినిమా సెట్ లో జరిగిన ఓ సన్నివేశం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇన్నేళ్ల తర్వాత కూడా చిరులో అప్పటి పవర్, స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించే సీన్ ఒకటి సెట్స్ లో జరిగిందట. ఓ సన్నివేశంలో చిరంజీవి పర్ ఫార్మెన్స్ చూసి టోటల్ యూనిట్ అంతా షాక్ అయిందట. కంప్లీట్ ఎమోషనల్ సీన్ ను చిరంజీవి తనదైన శైలిలో పండించిన విధానం చూసి అంతా మైమరిచిపోయారట. పేరుకు ఇది రీమేక్ సినిమానే అయినప్పటికీ… ఖైదీనంబర్-150లో పాత్రకు చిరంజీవి తనదైన స్టయిల్, మేజిక్ యాడ్ చేశారని చెప్పుకుంటున్నారు. వినాయక్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.