హాలీవుడ్ ను మించి...

Thursday,October 27,2016 - 03:22 by Z_CLU

బాహుబలిని మించిన బాహుబలిని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. విజువల్ ఎఫెక్ట్స్ దగ్గరి నుండి యాక్షన్ సీక్వెన్సెస్ వరకు బాహుబలికి ధీటుగా బాహుబలి-2 ని ప్లాన్ చేస్తున్న రాజమౌళి… ప్రపంచంలో ఇప్పటివరకు ఏ సినిమాకు వాడని టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. బాహుబలి-2 కోసం ప్రపంచంలోనే మొదటిసారిగా 360 డిగ్రీ కెమెరా వాడుతున్నాడు జక్కన్న. 24   హై-ఎండ్ కెమెరాల కాంబినేషన్ తో తయారైన ఈ రేర్ కెమెరాతో కొన్ని పర్టిక్యులర్ షాట్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు హాలీవుడ్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయని ఈ టెక్నాలజీతో బాహుబలిని మించిన బెస్ట్ విజువల్ వండర్ గా తెరకెక్కుతోంది బాహుబలి 2.