ఏం జరుగుతోంది..?

Tuesday,March 21,2017 - 02:51 by Z_CLU

మెగాస్టార్ నెక్స్ట్ సినిమా లాంచ్ ఎప్పుడు..? ఇదే మెగా స్ట్రీట్స్ లో చక్కర్లు కొడుతున్న హాట్ టాపిక్. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా స్టోరీ ఆల్ రెడీ లాక్ అయింది. సెట్స్ దగ్గరి నుండి టెక్నీషియన్స్ ని ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్న సినిమా యూనిట్, ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి ఏ అప్ డేట్ బయటికి రానివ్వడం లేదు.

ఖైదీ నం 150 లో అదే స్టామినా, అదే జోష్ అని ప్రూఫ్ చేసుకున్న మెగాస్టార్ ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లో స్వాతంత్ర సమర యోధుడిలా కనిపించనున్నాడు. పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కనున్న ఈ సినిమాను రేపోమాపో అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు.

ఖైదీతో మెగా ప్రొడ్యూసర్ ట్యాగ్ కి పక్కా క్వాలిఫై అనిపించుకున్న రామ్ చరణ్ ఈ సినిమాని కూడా తానే నిర్మించనున్నాడు. ప్రస్తుతం సుకుమార్ సినిమా మేకోవర్ తో, డిస్కర్షన్స్ తో బిజీగా ఉన్న చెర్రీ, మరో వైపు ఉయ్యాల వాడ టీం తో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అంతకు మించి ఏ ఇంటరెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు.