అది జస్ట్ రూమరే

Tuesday,March 21,2017 - 03:50 by Z_CLU

మాసివ్  డైరెక్టర్ వి.వి.వినాయక్ ఇంకా తన నెక్స్ట్ వెంచర్ అనౌన్స్ చేయలేదు. ఖైదీ నం 150 సక్సెస్ తో బ్యాక్ టు ఫామ్ అనిపించుకున్న వినాయక్ నెక్స్ట్ హీరో ఎవరా అన్న క్వశ్చన్ టాలీవుడ్ లో హై ఎండ్ క్యూరాసిటీ రేజ్ చేస్తుంది. ఈ క్యూరాసిటీ కొత్త కొత్త రూమర్స్ కి బోలెడంత స్పేస్ ని జెనెరేట్ చేస్తుంది.

నిన్నటి వరకు వి.వి.వినాయక్ మంచు మనోజ్ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి రానుందనే టాక్ టాలీవుడ్ లో చిన్న సైజు వైబ్రేషన్స్ నే క్రియేట్ చేసింది. కానీ ఆ టాక్ లో ఏ మాత్రం నిజం కాదని తేలిపోయింది. మంచు మనోజ్ వి.వి. వినాయక్ కాంబినేషన్ లో ఇప్పట్లో సినిమా లేదు ఇది పక్కా కన్ఫం.

ఇకపోతే గుంటూరోడు రిలీజ్ తరవాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సెట్స్ పై ఉన్నాడు మంచు మనోజ్. వి.వి. వినాయక్ కూడా మరో హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రేపో మాపో సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నాడు. ఆ సినిమాకి హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.