God Father చిరు బర్త్ డే టీజర్ రెడీ
Thursday,August 18,2022 - 03:15 by Z_CLU
Megastar Chiranjeevi’s ‘Godfather’ Teaser On August 21st
‘గాడ్ ఫాదర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి రఫ్ అండ్ స్టయిలిష్ లుక్ తో ఇంప్రెస్ చేసి మంచి బజ్ క్రియేట్ చేశారు. చిరు పాత్రను పరిచయం చేయడానికి రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా ఎట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా నుండి టీజర్ రాబోతుంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 21న సినిమా టీజర్ విడుదల చేయబోతున్నట్లు ఓ కొత్త పోస్టర్ తో ప్రకటించారు.

మేకర్స్ విడుదలచేసిన పోస్టర్‌లో చిరంజీవి సీరియస్‌గా కనిపిస్తున్నాడు, బ్లాక్ షేడ్స్‌తో కనిపిస్తున్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో సిటీ నైట్ వ్యూ డిజైన్ చేశారు. చిరంజీవి తన కెరీర్‌లో రఫ్ అండ్ స్టయిలిష్ లుక్‌లో కనిపించడం ఇదే తొలిసారి.
గాడ్ ఫాదర్ భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్‌బి చౌదరి మరియు ఎన్ వి ప్రసాద్ నిర్మిస్తున్నారు, కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. పూరి జగన్నాధ్, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ SS థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
ఈ ఏడాది దసరా సందర్భంగా ‘గాడ్‌ఫాదర్’ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics