DHAMAKA ఫస్ట్ సాంగ్ అదిరింది

Thursday,August 18,2022 - 04:33 by Z_CLU

 “DHAMAKA” First Single Jinthaak Lyrical Video Out

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధమాకా’ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ మేనరిజం నుండి జింతాక్ అనే పదం తీసుకొని భీమ్స్ కంపోజ్ చేసిన ఈ  సాంగ్ ప్రస్తుతం ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

కాసర్ల శ్యామ్ అందించిన మాస్ లిరిక్స్ ని అంతే మాసీగా పాడి భీమ్స్, మంగ్లీ సాంగ్ కి అందం తీసుకొచ్చారు. అలాగే లిరికల్ వీడియోలో సాంగ్  మేకింగ్ విజువల్స్ , రవితేజ , శ్రీలీల డాన్స్ స్టెప్స్ ఆకట్టుకున్నాయి. ఆల్బం నుండి మొదటి సాంగ్ గా రిలీజైన ఈ సాంగ్  మిగతా సాంగ్స్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసేలా ఉంది.

రవితేజ -భీమ్స్ సెసిరోలియో కాంబోలో వచ్చిన ‘బెంగాల్ టైగర్’ సూపర్ హిట్ ఆల్బం అనిపించుకుంది. మళ్ళీ ఇన్నాళ్ళకి వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ ఆల్బం పై మంచి అంచనాలున్నాయి. ఫస్ట్ సింగిల్ తోనే ఆ అంచనాలను అందేసుకొని ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసి సినిమాకు అదిరిపోయే మాస్ సాంగ్ అందించాడు భీమ్స్. ఈ సాంగ్ సింగిల్ స్క్రీన్స్ లో ఒక ఊపు ఊపేసి మాస్ ఆడియన్స్ ని ఫిదా చేయడం ఖాయమనిపిస్తుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ LLP బేనర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బెజవాడ ప్రసన్న కుమార్ స్టోరీ -స్క్రీన్ ప్లే -డైలాగ్స్ అందించాడు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.