The Ghost పవర్ ఫుల్ వెపన్ తో Tamahagane ప్రోమో

Thursday,August 18,2022 - 01:11 by Z_CLU

అక్కినేని నాగార్జున లేటెస్ట్ అప్ కమింగ్ మూవీ ‘ది ఘోస్ట్’ నుండి Thamahagane ప్రోమో రిలీజ్ అంటూ ఎనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుండి అసలు Thamahagane అంటే ఏమిటి ? ఇది టీజరా ? లేక ఇంకేమైనా కొత్తగా చూపించబోతున్నారా ? అనే క్యురియాసిటీ రైజ్ అయింది. ఇక సినిమాలో నటించిన నటీ నటులు కూడా #WhatIsTamahagane అనే డౌట్ రైజ్ చేస్తూ ఆడియన్స్ లో ఆసక్తి పెంచారు.

తాజాగా మేకర్స్ Thamahagane గురించి చెప్తూ ఓ స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తుంది. Thamahagane అనేది ఓ విలువైన ఇనుము అని చెప్తూ విక్రమ్ ఆ మెటిరియల్ తో ఓ పవర్ ఫుల్ వెపన్ రెడీ చేసి దానితో  అండర్ వరల్డ్ గ్యాంగ్ మీద ఎటాక్ చేసేందుకు రెడీ అయ్యే విజువల్స్ తో రిలీజైన గ్లిమ్స్ ఆకట్టుకుంది. ముఖ్యంగా కెమెరా వర్క్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇందులో హైలైట్ గా నిలిచాయి.

గ్లిమ్స్ చివర్లో ఆగస్ట్ 25న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ బేనర్స్ పై సునీల్ నారంగ్ , రామ్మోహన్ రావు , శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది.   షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా స్పెషల్ గా అక్టోబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics