Pavitra Naresh’s ‘Malli Pelli’ first look out
పవిత్రా, నరేష్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతుంది. నిజ జీవితంలో వీరిద్దరికీ ఎదురైన సంఘటనల ఆధారంగా సినిమా రాబోతుంది. ఎమ్మెస్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా సినిమాకు ‘మళ్ళీ పెళ్లి’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పెళ్లి తర్వాత పవిత్ర ఇంటి బయట ముగ్గు పెడుతుంటే పక్కనే కూర్చొని నరేష్ ఆమెను చూస్తున్న స్టిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఆ మధ్య వీకే నరేష్ , పవిత్ర ఇద్దరు ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అయింది. తాజాగా వీరిద్దరి పెళ్లి వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆ రెండూ ఈ సినిమాలోనివే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. విజయ కృష్ణ మూవీస్ పై నరేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నటుడిగా నరేష్ యాబై ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ లో చెప్పారు.
శరత్ కుమార్ , జయసుధ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వనిత విజయ కుమార్ , అనన్య నాగళ్ల , రోషన్ , అన్నపూర్ణమ్మ , భద్రం , యుక్త , ప్రవీణ్ యండమూరి , మధూ మిగతా పాత్ర ధారులు. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సమ్మర్ లో తెలుగు , కన్నడలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics