#PKSDT రిలీజ్ డేట్ లాక్

Friday,March 24,2023 - 04:34 by Z_CLU

Release date locked for Pawan Kalyan, Sai Dharam Tej’s ‘PKSDT’ Movie

పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో మోస్ట్ ఎవయిటింగ్ క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న #PKSDT సినిమాకు సంబంధించి ఊహించని అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉండగానే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి ఫ్యాన్స్ ,మూవీ లవర్స్ కి ట్రీట్ ఇచ్చారు. జులై 28న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ నెల రోజుల పాటు డేట్స్ ఇచ్చారు. పవన్ -సాయి ధరం తేజ్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అలాగే మూవీ లవర్స్ లో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

సముద్రఖని దర్శకత్వంలో వినోదాయ సీతమ్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ మోడ్రన్ గాడ్ పాత్రలో కనిపించనున్నాడు. తేజ్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా నటిస్తున్న ఈ సినిమాలో మమ అల్లుడు మధ్య వచ్చే సన్నివేశాలు మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వనున్నాయని తెలుస్తుంది.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics