అంతా ఫిక్సయిపోయింది

Tuesday,March 07,2017 - 01:58 by Z_CLU

క్రియేటివ్ సెట్స్ అయితే అంత ప్రాబ్లం అయ్యేది కాదేమో. నేచురల్ లొకేషన్స్… అందునా 80’s బ్యాక్ డ్రాప్ అనేసరికే సుక్కు సినిమా యూనిట్ ఎన్నడూ లేని విధంగా కష్టపడాల్సి వచ్చింది. ఏదేమైనా సుకుమార్ విజన్ కి మ్యాచ్ అయ్యే లొకేషన్స్ కేరళలో దొరికేసరికి ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది యూనిట్. లొకేషన్స్ కి గ్రీన్ సిగ్నల్ దొరికేసరికి మ్యాగ్జిమం అన్ని ఫిక్సయినట్టే అని డిక్లరేషన్ కూడా దొరికిపోయింది.

మార్చి 20న సినిమాని సెట్స్ పైకి తీసుకురాబోతున్న యూనిట్, ఏ మాత్రం బ్రేక్ లేకుండా ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తిచేసే ఆలోచనలో ఉంది. 10 రోజుల పాటు సాాగే ఈ షెడ్యూల్ లో సమంత, రామ్ చరణ్ కాంబినేషన్ లో కొన్నికీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు.

బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని డిజైన్ చేసిన యూనిట్… జూలై నాటికి ప్యాకప్ చెప్పాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ సినిమాకి రాక్ స్టార్ DSP ఇప్పటికే కొన్ని ట్యూన్స్ కంపోజ్ చేేశాడు.