మెగాపవర్ ఫుల్ ఇంట్రడక్షన్

Monday,November 07,2016 - 12:44 by Z_CLU

ధృవ ఇంట్రడక్షన్ సాంగ్ పూర్తయింది. ఆ విషయం స్వయంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సినిమా మొత్తంలో ఆ పాట తనకు చాలా ఫేవరేట్ అని చెప్పుకొచ్చిన రామ్ చరణ్… ధృవ  రిలీజ్ పై చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు.  స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్ టైనర్ ‘ధృవ’ దాదాపు షూటింగ్ పూర్తయిపోయినట్టే.

పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్న ‘ధృవ’ సినిమా తమిళ్ బ్లాక్ బస్టర్ కి రీమేకే అయినా, అటు సురేందర్ రెడ్డి మార్క్, ఇటు మెగా పవర్ ఇమేజ్ కి తగ్గట్టు తెరకెక్కుతోంది.