మరో సినిమాతో నిఖిల్ రెడీ..

Monday,November 07,2016 - 01:16 by Z_CLU

‘స్వామిరారా’, ‘కార్తికేయ‌’, ‘సూర్య vs సూర్య’ లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో హిట్స్ కొట్టిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’. ఈచిత్రంలో నిఖిల్ కి జంట‌గా హెబా ప‌టేల్, నందిత‌ స్వేత లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు.

మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలోని మెద‌టి సాంగ్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయక్ విడుద‌ల చేశారు. ఆడియోని ఈ వార‌మే మార్కెట్లోకి తీసుకొచ్చి, వెంటనే ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.

epc-2
శేఖ‌ర్ చంద్ర ఈ సినిమాకు సంగీత దర్శకుడు. పక్కా హారర్ కాన్సెప్ట్ తో ఎక్కడికి పోతావ్ చిన్నవాడా తెరకెక్కింది.