రామ్ కోసం మరోసారి బ్యాంకాక్ ...

Monday,November 07,2016 - 12:14 by Z_CLU

పూరి జగన్నాథ్ మళ్ళీ బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కాడు. ఇజం హిట్టవడంతో ఓ వైపు ఆ సినిమా హిందీ రీమేక్  కోసం ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు మరో కొత్త స్టోరీలైన్-స్క్రీన్ ప్లే వర్కవుట్  చేసేందుకు బ్యాంకాక్ చెక్కేశాడు. అయితే పూరి జగన్నాధ్ ఉన్నఫలంగా బ్యాంకాంక్ ఎందుకు వెళ్లాడనేది ప్రస్తుతం అందరి డౌట్.

ఎన్టీఆర్ కోసం ఇప్పటికే ఓసారి బ్యాంకాక్ వెళ్లొచ్చాడు పూరి. బాక్సర్ అనే వర్కింగ్ టైటిల్ తో స్టోరీ రెడీగా ఉంది. మరోవైపు మహేష్ కోసం జనగణమన అనే స్టోరీని స్క్రీన్ ప్లేతో పాటు ఇప్పటికే కంప్లీట్ చేశాడు. మరి ఇప్పుడు ఎవరికోసం పూరి, బ్యాంకాక్ ఫ్లయిట్ ఎక్కాడనేది అందరి డౌట్.

తాజా సమాచారం ప్రకారం… హీరో రామ్ కు పూరీ జగన్నాధ్ ఈమధ్యే ఓ స్టోరీలైన్ వినిపించాడట. మహేష్ కు పోకిరి, ఎన్టీఆర్ కు టెంపర్ లా… రామ్ కు ఆ  సినిమా ప్లస్ అవుతుందట. ఈ సినిమా స్క్రీన్ ప్లేను డెవలప్ చేసేందుకే… పూరి జగన్నాధ్.. బ్యాంకాక్ వెళ్లాడని టాక్.