మొబైల్ లో మెగా గేమ్

Monday,February 06,2017 - 04:55 by Z_CLU

ఖైదీ నంబర్ 150 హంగామాను మనం చూస్తున్నాం. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇంకా వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇప్పుడీ మేనియాను కంటిన్యూ చేస్తూ మెగా గేమ్ ఒకటి రెడీ అయింది. ఖైదీ నంబర్ 150 థీమ్ తో ఓ మొబైైల్ గేమ్ క్రియేట్ అయింది. ఖైదీ నంబర్ 150 దర్శకుడు వినాయక్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంయుక్తంగా ఈ మొబైల్ గేమ్ ను లాంచ్ చేశారు. ఈ గేమ్ లో మొత్తం 14 లెవెల్స్ ఉంటాయి. ఒక్కో లెవెల్లో మెగాస్టార్ ఒక్కో రకంగా కనిపిస్తారు. అంతేకాదు.. ఒక్కో గెటప్ లో కనువిందు చేస్తారని చెబుతోంది గేమ్ డెవలపర్ సంస్థ. ఈ మెగా 150 గేమ్ ను ఏ స్మార్ట్ ఫోన్ లో అయినా డౌన్ లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు.

mega-mobile-game-1

mega-mobile-game-2