వెండితెరపై ఎన్టీఆర్ జీవిత చరిత్ర...?

Monday,February 06,2017 - 05:48 by Z_CLU

గౌతమీపుత్ర శాతకర్ణీ గ్రాండ్ సక్సెస్ తరవాత ఇంకా తన 101 వ సినిమా అనౌన్స్ చేయలేదు బాలయ్య. ఆ మధ్య కృష్ణవంశీతో రైతు సినిమా డిస్కషన్స్ వచ్చినా, ఇంకా ఆ సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. దీంతో బాలయ్య నెక్స్ట్ సినిమా గ్యారంటీగా బయోపికే అనే టాక్ ఒకటి హల్ చల్ చేస్తుంది.

ఇప్పటి వరకు ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే జరగలేదు కానీ, బాలకృష్ణ NTR బయోపిక్ లో నటించనున్నాడని, ఈ సినిమాని స్వయంగా తానే ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నాడనే టాక్ నందమూరి ఫ్యాన్స్ లో సరికొత్త క్యూరాసిటీని రేజ్ చేస్తుంది.

balakrishna

అటు రాజకీయ వేత్తగా, మహా నటుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు గారి బయోపిక్ అనగానే సరికొత్త ఇంట్రెస్ట్ జెనెరేట్ అవ్వడం న్యాచురలే అయినా, ఈ టాక్ ఎంతవరకు వాస్తవం అనేది బాలయ్య స్వయంగా అనౌన్స్ చేస్తే కానీ క్లారిటీ రాదు.