నేనంత పెద్ద క్రిమినల్ కాదు

Monday,February 06,2017 - 04:30 by Z_CLU

ఓం నమో వెంకటేశాయ ఫిబ్రవరి 10 న రిలీజ్ కానుంది. నాగార్జున హాతీరాం బాబాగా నటించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అనుష్క కృష్ణమ్మ అనే ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించింది. ఓం నమో వెంకటేశాయ కూడా అన్నమయ్య, శ్రీరామదాసు తరహా హార్ట్ టచింగ్ డివోషనల్ ఎంటర్ టైనర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న నాగ్, ప్రగ్యా జైస్వాల్.

నిజానికి మరో డివోషనల్ ఎంటర్ టైనర్ చేసే ఆలోచనలో లేని నాగ్, రాఘవేంద్ర రావు గారు ఈ సినిమా స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు, అన్నమయ్య కన్నా గొప్పగా ఏదైనా చేయగలం అన్నప్పుడే ఈ సినిమా గురించి ఆలోచిద్దాం అన్నాడట. అంత గొప్పగా అనిపించింది కాబట్టే సినిమా సెట్స్ పైకి వచ్చిందని చెప్పాడు నాగ్.

కథ, స్క్రీన్ ప్లే తో పాటు పాటలపై స్పెషల్ ఫోకస్ పెట్టే దర్శకేంద్రుడు నాగ్, ప్రగ్యా కాంబోలో తెరకెక్కిన ‘ఆనందం’ పాటకి ఏకంగా 50,000 దీపాలు వాడాడట. హీరోయిన్స్ ని ప్రత్యేకంగా చూపించే KRR ఈ పాటలో రిచ్ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నాడు. స్పెషల్ గా ఫస్ట్ లుక్ లో ప్రగ్యా వేసుకున్న కాస్ట్యూమ్స్ ఏకంగా 14 కిలోల బరువు ఉంటాయి.

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన హ్యాప్పీనెస్ ని షేర్ చేసుకున్న నాగ్, దేవుడిని భక్తుడిగా కొలవడం కన్నా, ఫ్రెండ్ గా ట్రీట్ గా చేయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను చెప్పుకున్నాడు. ఇన్ని ఇచ్చిన దేవుడి దగ్గర కొరుకోవడానికి ఇంకే కోరికలు లేవని చెప్పిన నాగ్, ఇంకా కోరుకుంటే అది క్రైం అవుతుందని.. నేనంత పెద్ద క్రిమినల్ ని కానని సంతృప్తిగా చెప్పుకున్నాడు.