100 కోట్ల క్లబ్ లో చేరిన 'ధమాకా'

Friday,January 06,2023 - 11:59 by Z_CLU

మాస్ మహారాజా రవితేజ Raviteja  లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధమాకా’ Dhamaka  వంద కోట్ల క్లబ్ లో చేరింది. క్రిస్మస్ కనుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కమర్షియల్ యాక్షన్ డ్రామా ఆడియన్స్ కి  థియేటర్స్ లో మంచి ఎక్స్ పీరియన్స్ అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లిస్టులో చోటు సంపాదించుకుంది. ‘క్రాక్’ తర్వాత వరుస అపజయాలు అందుకున్న రవితేజ ‘ధమాకా’ తో ఫస్ట్ టైమ్ 100 కోట్ల (గ్రాస్) క్లబ్ నిలిచాడు.

రవితేజను ఎలా చూపిస్తే ఫ్యాన్స్ మురిసిపోతారో సరిగ్గా అలానే ప్రెజెంట్ చేసి మాస్ మహారజా కి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు దర్శకుడు త్రినాద్ రావు. ఇక ఈ డబుల్ యాక్షన్ కన్ఫ్యూజన్ డ్రామా కథకి ప్రసన్నా కుమార్ బెజవాడ రాసుకున్న స్క్రీన్ ప్లే , డైలాగ్స్ బిగ్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. త్రినాద్ రావు -ప్రసన్నా థియేటర్స్ కోసం డిజైన్ చేసుకున్న అన్నీ ఎలిమెంట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. బీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ కూడా సక్సెస్ లో కీ రోల్ పోషించింది. రవితేజ సరసన నటించిన శ్రీలీల తన గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసి యూత్ ఆడియన్స్ ను మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి రప్పించింది. అందం , అభినయం , డాన్సులతో కుర్రకారుకి విజువల్ ట్రీట్ ఇచ్చి సక్సెస్ లో రవితేజ తర్వాత మేజర్ షేర్ దక్కించుకుంది.

ఓవరాల్ గా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకొని కమర్షియల్ మాస్ సినిమాలకి మళ్ళీ ఒక కొత్త ఊపు తీసుకొచ్చింది ‘ధమాకా’.  కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకి ‘ధమాకా’ మరో బిగ్గెస్ట్ సక్సెస్ అందించింది. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics