Kalyanam Kamaneeyam ట్రైలర్ టాక్

Thursday,January 05,2023 - 05:49 by Z_CLU

యువ హీరో సంతోష్ శోభన్ లేటెస్ట్ మూవీ ‘కళ్యాణం కమనీయం’. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది.  పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించిన ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తుంది.  సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “కళ్యాణం కమనీయం” సినిమా ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క విడుదల చేసింది.

ట్రైలర్ చూస్తే…శివ, శృతి ప్రేమ బంధం నుంచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు. పెళ్లైన కొత్తలో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారు. శివకు ఉద్యోగం లేకపోవడం శృతికి ఇబ్బందిగా మారుతుంది. భార్యను సంతోషపెట్టేందుకు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు శివ. ఆ ప్రయత్నాలు ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్లాయి. శివ ఉద్యోగం సంపాదించి శృతిని హ్యాపీగా ఉంచాడా లేదా అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు.

శివకు ఉద్యోగం లేకపోవడం ఈ జంట మధ్య ఎలాంటి మనస్పర్థలకు దారి తీసింది అనేది కూడా ఎమోషనల్ గా పిక్చరైజ్ చేశారు. ఇది ప్రతి భార్య కథ, ప్రతి భర్త కథ, ఇది ప్రతి పెళ్లి కథ అంటూ వేసిన క్యాప్షన్స్ స్టోరికి యాప్ట్ అనిపించాయి. మొత్తంగా అన్ని భావోద్వేగాలు ఉన్న ఓ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “కళ్యాణం కమనీయం” చిత్రాన్ని రూపొందించినట్లు అర్థమవుతుంది. విజువల్స్ , మ్యూజిక్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి.

సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి భారీ చిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా కళ్యాణం కమనీయం రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics