'కస్టడీ'  టీజర్ మార్చి 16న విడుదల

Monday,March 13,2023 - 08:03 by Z_CLU

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి  ప్రతి ప్రమోషనల్ కంటెంట్- ప్రధాన తారాగణం ఫస్ట్-లుక్ పోస్టర్లు, గ్లింప్స్ కు అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ నెల 16న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. టీజర్ తేదీని అనౌన్స్ చేయడానికి, ఆసక్తిని పెంచడానికి ఉద్దేశించిన టీజర్ టీజ్ ని విడదల చేశారు. నదిలో జైలు..ఆ జైలు నుంచి తనని తాను విడుపించుకొని బయటికి వస్తున్న నాగచైతన్య వీడియో చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ టీజ్ వీడియోలో నాగచైతన్య ఖాకీ యూనిఫామ్‌లో కనిపించారు.

ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

నాగచైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తుండగా, ఎస్‌ఆర్‌ కత్తిర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజీవ్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌, డివై సత్యనారాయణ ఆర్ట్‌ డైరెక్టర్‌. కస్టడీ మే 12, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.