రమ్యకృష్ణ లేకపోతే శైలజారెడ్డి లేదు

Tuesday,September 11,2018 - 12:35 by Z_CLU

శైలజారెడ్డి అల్లుడు.. ఈ కాన్సెప్ట్ కు నాగచైతన్య పెర్ ఫెక్ట్ అంటున్నాడు డైరక్టర్ మారుతి. అయితే నాగచైతన్య ఎంత ఇంపార్టెంటో.. రమ్యకృష్ణ కూడా అంతే కీలకం అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే.. రమ్యకృష్ణ లేని శైలజారెడ్డి అల్లుడు చిత్రాన్ని ఊహించుకోలేని అంటున్నాడు మారుతి

“ఈ సినిమాకు రమ్యకృష్ణ ఓకే చేయకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే నేను కథ రాసుకున్నప్పుడే ఆమెను దృష్టిలో పెట్టుకొని రాశాను. ఆమె ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పకపోతే ఏమయ్యేదో ఊహించుకోలేను.”

రమ్యకృష్ణపై మారుతి రియాక్షన్ ఇది. బాహుబలిలో శివగామి పాత్ర చూసిన తర్వాత, శైలజారెడ్డి పాత్రకు రమ్యకృష్ణ మాత్రమే న్యాయం చేయగలరని భావించానని అంటున్నాడు మారుతి. రమ్యకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగిన తను, ఆమెకే ‘యాక్షన్-కట్’ చెబుతానని ఎప్పుడూ అనుకోలేదంటున్నాడు.

అలా శైలజారెడ్డి అల్లుడు సినిమాను రమ్యకృష్ణ లేకుండా ఊహించలేనంటున్నాడు మారుతి. పేరుకు ఇది లవ్ స్టోరీనే అయినప్పటికీ సెకెండాఫ్ లో కథ మొత్తం రమ్యకృష్ణ చుట్టూనే తిరుగుతుందంటున్నాడు.