బాహుబలి కంటే ముందే...

Monday,October 31,2016 - 11:31 by Z_CLU

రానా కరియర్ ను బిగినింగ్ నుండి గమనిస్తే ఏదోలా యాక్టర్ ని అనిపించుకుందాం అని సినిమాలు తీస్తున్నట్టు ఉండదు. ప్రతి సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఓ సినిమాకు సంతకం చేశాడంటే ఎన్ని తంటాలు పడైనా సరే ఆ క్యారెక్టర్ కి ఒక లుక్ ని తీసుకొచ్చి పెడతాడు. బాహుబలి లో భళ్లాలదేవగా కనిపిస్తున్న రానా… హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న ‘గజి’ సినిమాలో సైనికుడిలా కనిపించనున్నాడు. ఈ సినిమాలో రానా సరసన హీరోయిన్ గా నటిస్తున్న తాప్సి శరణార్థి పాత్రలో కనిపిస్తుంది.

1920009_604839706333957_5259938955432917177_n

దర్శకుడు సంకల్ప్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘గజి’…. 1971 లో జరిగిన అండర్ వాటర్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా. మూవీలోని ప్రతి సన్నివేశం ‘ బ్లూ ఫిష్’ నవల ఆధారంగా తెరకెక్కుతుంది. ఆ నవల రాసిన రచయిత సంకల్ప్ ఈ సినిమాకి మెగాఫోన్ పెట్టుకున్నాడు. PVP బ్యానర్ పై తెరకెక్కుతున్న ‘గజి’ సినిమాని ఫిబ్రవరి 24, 2017 కల్లా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది సినిమా యూనిట్.