మరో సినిమా రెడీ చేసిన చైతూ

Monday,October 31,2016 - 12:13 by Z_CLU

నాగ చైతన్య రొమాంటిక్ అడ్వెంచరస్ జర్నీకి ఎట్టకేలకు రిలీజ్ డేట్ కన్ఫం అయింది.  గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ”సాహసం శ్వాసగా సాగిపో ” నవంబర్ 11 న రిలీజ్ కానున్నట్టు అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రయిలర్ తో సినిమా పట్ల మంచి క్రేజ్ క్రియేట్ అయింది. పైగా రెహ్మాన్ కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే హిట్ అవ్వడం సినిమాకు మరో ప్లస్ పాయింట్. గౌతమ్ మీనన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాతో మంజిమా మోహన్ తెలుగు తెరకు పరిచయమవుతుంది.

1

ప్రేమమ్ తో ఇప్పటికే  సూపర్ హిట్ అందుకున్నాడు చైతూ. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ అందుకున్నాడు. అదే ఊపులో  ఇప్పుడు సాహసం శ్వాసగా సాగిపో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాడు. ఏమాయచేశావె సినిమా తర్వాత చైతూ-గౌతమ్ మీనన్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.