మంచు లక్ష్మీతో దేవ అండ్ దాస్

Saturday,September 29,2018 - 12:03 by Z_CLU

ఓవరాల్ గా ఎక్కడ చూసినా సూపర్ హిట్ టాక్ దక్కించుకుంటుంది దేవదాస్. దానికి తోడు వీకెండ్ కూడా కలిసి రావడంతో మరిన్ని వసూళ్లు రికార్డ్ చేసుకుంటుంది ఈ సినిమా. అయితే సినిమా ఇంతగా వైడ్ రేంజ్ లో అయ్యేలా, యూనిట్ చేసిన భారీ ప్రమోషన్స్ కూడా సినిమా సక్సెస్ కి రీజనయ్యాయి. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ తో నాగ్ & నాని ఆన్ స్క్రీన్ జోడీల సమేతంగా చేసిన చిట్ చాట్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

దేవదాస్ లో నాని లేడు – నాగార్జున

నేను చాలా మల్టీ స్టారర్స్ చేశాను కానీ, దేవదాస్ వేరు. నానితో పని చేసేటప్పుడు అసలు ఇంకో హీరోతో పని చేస్తున్నాననే ఫీలింగ్ లేదు. నాని కంప్లీట్ గా ‘దాస్’ క్యారెక్టర్ లో జీవించేశాడు. సినిమాలో ఎక్కడ కూడా హీరోలా కనిపించాలనే ప్రయత్నం కూడా చేయలేదు.

గుర్తొచ్చింది – నాని  

దేవదాస్ షూటింగ్ వినాయకుడి సాంగ్ తో బిగిన్ అయింది. ఫస్ట్ డే నేనొక్కడినే, నెక్స్ట్ డే నాగ్ సర్ జాయిన్ అయ్యారు. ఆయన ఇలా సెట్స్ కి వచ్చి స్టెప్ వేశారో లేదో, యూనిట్ మొత్తం అరుపులు, కేకలు… అదే నేను స్టెప్పులేస్తే అసలేమీ లేదు.. అప్పుడు గుర్తొచ్చింది అవతల నాగ్ సర్ అని… (నవ్వుతూ).

వీటితో పాటు ఈ సినిమాలోని గ్లామర్ స్పేస్ రష్మిక, ఆకాంక్ష గురించి కూడా చాలా విషయాలు రివీల్ చేశారు నాగ్, నాని. ఆ విహ్స్యాలు తెలుసుకోవాలంటే కింద లింక్ క్లిక్ చేయండి.