మలయాళంలోకి మనం

Friday,December 30,2016 - 12:53 by Z_CLU

సాధారణంగా సూపర్ హిట్ అయిన మలయాళం సినిమాలు తెలుగులోకి రీమేక్ అవుతుంటాయి. తాజాగాా వచ్చిన ప్రేమమ్ సినిమా కూడా మలయాళం రీమేకేే. అయితే ఓ తెలుగు సినిమా మలయాళంలోకి రీమేక్ అవ్వడం మాత్రం అరుదు. అలాంటి అరుదైన రికార్డే సృష్టించింది మనం సినిమా. విక్రమ్ కుమార్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.

Manam Movie Latest New Photos

తెలుగులో నాగార్జున పోషించిన పాత్రను మమ్ముట్టి పోషించబోతున్నాడు. నాగచైతన్య పోషించిన పాత్రలో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కనిపిస్తాడు. ఇక సమంత, శ్రియ పోషించిన పాత్రలకు నిత్యామీనన్, మమతా మోహన్ దాస్ లను తీసుకున్నారు. తెలుగులో లెజెండ్ ఏఎన్నార్ నటించిన పాత్ర కోసం మలయాళ నటుడు మధును ఎంపిక చేశారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రాబోతోంది.