BirthDay Wishes: పుకార్లకు చెక్

Monday,July 27,2020 - 04:45 by Z_CLU

మహేష్ బాబు-వంశీ పైడిపల్లి
వీళ్లిద్దరు కలిసి చేసింది ఒక్క సినిమానే. కానీ ఇద్దరి మధ్య అనుబంధం మాత్రం చాలా పెద్దది. మహేష్ కే కాదు, మహేష్ కుటుంబానికే ఆప్తమిత్రుడైపోయాడు వంశీ పైడిపల్లి. రెండు కుటుంబాలు కలిసి సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలు ఎన్నో.

అలాంటి ఇద్దరు స్నేహితులు విడిపోయారంటూ కొన్ని నెలలుగా ఒకటే పుకార్లు. దీనికి కారణం. ఆమధ్య వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీలైన్ ను మహేష్ రిజెక్ట్ చేయడమే. అప్పట్నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందంటూ కొందరు గాసిప్స్ అల్లేశారు.

అలాంటి పుకార్లకు ఇవాళ్టితో చెక్ పడింది. ఈరోజు వంశీ పైడిపల్లి పుట్టినరోజు. తన ఫ్రెండ్ కు మనసారా శుభాకాంక్షలు అందించాడు మహేష్. ఎప్పట్లానే ఆనందంగా, ఎనర్జీతో ఉండమంటూ ట్వీట్ చేశాడు.

అటు నమ్రత కూడా “అప్పటి మధురమైన పాత రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నా” అంటూ పోస్ట్ పెట్టింది. సో.. ఇవాళ్టితో మహేష్-వంశీ పైడిపల్లి మధ్య అభిప్రాయబేధాలు లేవనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.