ఫ్యాన్స్ కు మహేష్ న్యూ ఇయర్ గిఫ్ట్

Sunday,January 01,2017 - 12:30 by Z_CLU

ఈ న్యూ ఇయర్ కానుకగా మహేష్ బాబు, తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదల చేస్తాడని అంతా ఎదురుచూశారు. కానీ మహేష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ విడుదలకాలేదు. కానీ అంతకంటే పెద్ద న్యూస్ నే అభిమానులకు అందించాడు మహేష్. న్యూ ఇయర్ సందర్భంగా తన సినిమాల లైనప్ ను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇన్నాళ్లూ కేవలం ప్రచారంగానే ఉన్న చాలా సినిమాలకు అఫీషియల్ గా ఓకే చేశాడు. ప్రస్తుతం మురుగదాస్ తో చేస్తున్న సినిమా కాకుండా… ఒకేసారి 3 ప్రాజెక్టులు ప్రకటించి, అభిమానుల్లో ఉత్సాహం నింపాడు.

ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తన 23వ సినిమా చేస్తున్నాడు మహేష్. ఇది కంప్లీట్ అయిన వెంటనే, 24వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా సినిమాను పట్టాలపైకి తీసుకురాబోతున్నాడు. ఇక తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నట్టు మహేష్ ప్రకటించాడు. ఈ 25వ సినిమాకు దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మాతలుగా ఉంటారని కూడా ఎనౌన్స్ చేశాడు.

mahesh-1 mahesh-2

వీటితో పాటు తన 26వ సినిమాను కూడా ప్రకటించాడు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై త్రివిక్రమ్ దర్శకత్వంలో 26వ సినిమా ఉంటుందని మహేష్ ఎనౌన్స్ చేశాడు. ఖలేజా సినిమా తర్వాత మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించలేదు మహేష్. ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ వర్కవుట్ అయింది. నిజానికి మహేష్ 25వ సినిమాకు త్రివిక్రమ్ ను దర్శకుడిగా అనుకున్నారు. కానీ ఆ అరుదైన అవకాశం వంశీ పైడిపల్లికి దక్కింది.