హైదరాబాద్ లో మహేష్ మైనపు విగ్రహం

Friday,February 22,2019 - 02:26 by Z_CLU

అవును.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉండాల్సిన మహేష్ మైనపు విగ్రహం హైదరాబాద్ లో కొలువుదీరబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మరో 3 రోజుల్లో (ఈనెల 25న) హైదరాబాద్ లో ఈ మైనపు విగ్రహాన్ని స్వయంగా మహేష్ ఆవిష్కరించబోతున్నాడు.

ఈ మైనపు విగ్రహం కోసం చాన్నాళ్ల కిందటే మహేష్ నుంచి కొలతలు తీసుకున్నారు టుస్సాడ్స్ నిర్వహకులు. 4 గంటల పాటు కష్టపడి దాదాపు 200కు పైగా కొలతలు తీసుకున్నారు. చివరికి కంటి రంగు, జుట్టు రంగు లాంటి చిన్నచిన్న అంశాల్ని కూడా విడిచిపెట్టలేదు.

అలా తయారైన మహేష్ మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ లో అతడికి చెందిన AMB సినిమాస్ లో పెట్టబోతున్నారు. కొన్ని రోజులు అక్కడుంచి ఆ తర్వాత సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలిస్తారట. సో.. ఇకపై మహేష్ తో సెల్ఫీ దిగాలంటే చాలా ఈజీ.