ఇది కాజల్ స్టైల్ గురుదక్షిణ...?

Friday,February 22,2019 - 03:48 by Z_CLU

టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ హీరోయిన్. తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కాజల్ నటించని టాప్ హీరో లేడు. పెళ్ళెప్పుడు కాజల్ అని అడిగితే..? ‘నాకూ చేసుకోవాలనే ఉంది, కానీ టైమే దొరకట్లేదు..’ అని చెప్పుకుంటుంది ఈ పంజాబీ భామ. అయితే ఈ స్థాయిలో సక్సెస్ అందుకున్న కాజల్ కి  తన మొదటి సినిమా  ‘లక్ష్మీ కళ్యాణం’ లో అవకాశం దొరికి ఉండకపోతే…? తేజ కాజల్ లోని ట్యాలెంట్ ని ఇగ్నోర్ చేసి ఉంటే..?, అలా జరగలేదు కాబట్టే నా బెస్ట్ బ్రిలియంట్ మెంటర్ అని చెప్పుకుంటుంది కాజల్.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటూ కూడా తన 50 వ సినిమాని తేజ తో ప్లాన్ చేసుకుంది కాజల్. రానా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’ లో నటించింది. నిజానికి చాలా రోజుల తరవాత తేజకి దక్కిన హిట్ ఇది. ఈ సినిమాతో సరిపెట్టుకుని లైట్ తీసుకోకుండా, ఇమ్మీడియట్ గా తేజ నెక్స్ట్ సినిమాకి కూడా సంతకం చేసింది. ‘సీత’ గా  ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో కంప్లీట్ గా డిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించనుంది కాజల్ అగర్వాల్.

ఇండస్ట్రీలో తేజ ఇంట్రడ్యూస్ చేసిన స్టార్స్ ఎందఱో ఉన్నారు. కానీ వారిలో కాజల్ ఎక్కువగా తేజ కాంపౌండ్ లో కనిపిస్తూ ఉంటుంది. తేజ టాపిక్ వస్తే చాలు తన గురువు అని చెప్పుకుంటూనే ఉంటుంది. అవకాశం కల్పించుకుని మరీ తన ఆల్ టైమ్  బ్రిలియంట్ మెంటర్ అని మెన్షన్ చేస్తూనే ఉంటుంది.

ఈ రోజు తేజ బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది  కాజల్ అగర్వాల్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ‘సీత’ పై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉంది. తేజ మళ్ళీ ట్రాక్ లో పడాలంటే స్టార్ సపోర్ట్ నిజంగా అవసరమా..? అంటే అస్సలు లేదు. కానీ తనను గుర్తించి అవకాశం ఇచ్చిన గురువును మరచిపోని కాజల్ అగర్వాల్ ని మాత్రం తప్పకుండా అభినందించాలి. ఇదో రకం గురుదక్షిణే కదా…